శుభ‌శ్రీ జీ.. మీరు ఎంతో మందికి స్పూర్తి: చిరు | Megastar Chiranjeevi Appreciates Odisha Police SI For Social Service | Sakshi
Sakshi News home page

శుభ‌శ్రీతో మాట్లాడిన మెగాస్టార్

May 12 2020 11:41 AM | Updated on May 12 2020 12:38 PM

Megastar Chiranjeevi Appreciates Odisha Police SI For Social Service - Sakshi

గుడ్‌మార్నింగ్‌ శుభ‌శ్రీ జీ: చిరు

అంగ‌వైక‌ల్యంతో, మ‌తి స్థిమితంలేని రోడ్డు ప‌క్క‌న ప‌డి ఉన్న ఓ అభాగ్యురాలికి ఆప్యాయంగా అన్నం ముద్ద‌లు క‌లిపి తినిపించిన ఒడిశా ఎస్సై శుభ‌శ్రీతో మెగాస్టార్ చిరంజీవి వీడియో కాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె చేసిన గొప్ప ప‌నికి అభినంద‌న‌లు తెలిపారు. ‘గుడ్ మార్నింగ్ శుభ‌శ్రీ జీ.. కొన్ని రోజుల క్రితం మీ వీడియో ఒక‌టి నా దృష్టికి వ‌చ్చింది. అందులో మీరు ఒక మ‌తి స్థిమితం లేని మ‌హిళ‌కు భోజ‌నం తినిపిస్తున్నారు. అది నా మ‌న‌సుకు తాకింది. న‌న్ను చ‌లింప‌చేసింది. ఆ రోజు నుంచి నేను మీతో మాట్లాడాల‌ని చాలా ప్ర‌య‌త్నిస్తున్నాను. నేను మీలో ఒక సానుభూతి నిండిన త‌ల్లి హ్రుద‌యం చూశాను. ఇది ఎంతో మందికి స్పూర్థినిస్తుంది.  మీకు త‌ప్ప‌కుండా ఎంతో మంది నుండి, ఎన్నో ప్రాంతాల నుండి అభినంద‌న‌లు వ‌చ్చే ఉంటాయి. (వృద్ధురాలి ఆకలి తీర్చిన మహిళా ఎస్‌ఐ)

మీరు ఆ వ్య‌క్తి ప‌ట్ల అంత ఆద‌ర‌ణ‌గా, మాన‌వీయంగా ఉన్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేయాల‌ని అనుకున్నాను. చాలా సంతోషించాను. మీరు ఇలాంటి ప‌నులు ఇంకా ఎన్నో చేస్తూ ఉండాలి. మీ క‌ర్త‌వ్యం గొప్ప‌గా ని‌ర్వ‌ర్తించాలి. నేను మీలో ఒక సానుభూతి నిండిన త‌ల్లి హృద‌యం చూశాను. ఇది ఎంతో మందికి స్పూర్తినిస్తుంది.  మీకు త‌ప్ప‌కుండా ఎంతో మంది నుండి, ఎన్నో ప్రాంతాల నుండి అభినంద‌న‌లు వ‌చ్చే ఉంటాయి. అయితే మి‌మ్మ‌ల్ని ఒక్క‌టి అడ‌గాల‌నుకుంటున్నా. మీరు ఈ విధంగా స్పందించ‌డానికి కార‌ణం ఏమిటి?  మీక‌లా చేయాల‌ని ఎందుకు అనిపించింది` అంటూ ఎస్సై శుభశ్రీని చిరంజీవి అడిగారు.  

'ముందుగా ధ‌న్య‌వాదాలు స‌ర్‌. నేను ఆవిడ‌కు ప్ర‌త్యేకించి చేసిందేమి లేదు స‌ర్‌. నేను ఆవిడ‌కు భోజ‌నం అందించిన‌ప్పుడు ఆవిడ త‌న చేతుల‌తో తీసుకునే ప‌రిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఆవిడ‌కు మాన‌సిక‌మైన సమ‌స్య మాత్ర‌మే కాదు అంగ‌వైక‌ల్యం కూడా ఉంది. మా ముఖ్య‌మంత్రి గారు దీని గురించి ట్వీట్ చేశారు. అంతేకాక మా ఏడీజీపీ అరుణ్ స‌లోంజి స‌ర్ ఎప్పుడు చెబుతూనే ఉంటారు. బాధ్య‌త‌ల నిర్వ‌ర్తించ‌డం అంటే లా అండ్ ఆర్డ‌ర్ ఒక‌టే కాదు. పౌరుల‌కు ఎలాంటి అవ‌స‌ర‌మొచ్చినా స‌హాయ‌ప‌డ‌ట‌మే మ‌న క‌ర్త‌వ్య‌మ‌ని అది నాకొక నిజ‌మైన రివార్డుగా నేను భావించాను.

మీతో ఒక విష‌యం చెప్పాలి. నేను ఎంతో ఉద్వేగంతో ఉన్నాను. మీరు నాతో మాట్లాడాల‌ని అనుకుంటున్నారు అని చెప్ప‌గానే నేను ఎంతో ఉత్తేజం పొందాను. మీరొక మెగాస్టార్ మాత్ర‌మే కాదు. మీరొక గొప్ప సామాజిక సేవ‌కులు. మీరు చేసిన ఎన్నో కార్య‌క్ర‌మాలు, ఎన్నో సెమినార్లు చూశాను. ఇక టూరిజం అభివృద్ధికి  మీరు చేసిన ఎన్నో ప‌నులు నాకు తెలుసు. నేను మీకు ఒక గొప్ప అభిమానిని` అంటూ శుభ‌శ్రీ పేర్కొన్నారు. ఇక మ‌తిస్థిమితంలేని ఓ అభాగ్యురాలికి శుభ‌శ్రీ అనే ఒడిశా ఎస్సై స్వ‌యంగా అన్నం తినిపించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.

చ‌ద‌వండి:
చైతూతో కలిసి సాహ‌స‌యాత్ర‌కు స‌మంత‌!
దేవిశ్రీ ఫిక్స్‌.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు పండ‌గే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement