బంజారా భాషలో... | Ram Naik Movie Shoot Begins At Hyderabad | Sakshi
Sakshi News home page

బంజారా భాషలో...

Mar 2 2020 5:15 AM | Updated on Mar 2 2020 5:15 AM

Ram Naik Movie Shoot Begins At Hyderabad - Sakshi

శుభాంగి, రమేష్‌ చౌహాన్

రమేష్‌ చౌహాన్, శుభాంగి జంటగా కపిల సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘రాం నాయక్‌’. శ్రీ తుల్జా భవానీ ఫిల్మ్‌ సిటీ పతాకంపై లక్ష్మీ చౌహాన్‌ నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రమేష్‌ చౌహాన్‌ మాట్లాడుతూ– ‘‘బంజారా భాషలో నిర్మించనున్న ఈ చిత్రంలో 5 పాటలు ఉంటాయి. సంగీత దర్శకుడు భోలే షావలి ఈ పాటలకు ప్రాణం పోశారు. చక్కటి కథతో కపిల సుబ్బారావు తెరకెక్కించనున్నారు’’ అన్నారు. ‘‘మా సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ రేపటి నుంచి మొదలుకానుంది. మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌ పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్‌ చిత్రీకరించనున్నాం’’ అన్నారు కపిల సుబ్బారావు. ‘‘గతంలో సూపర్‌ హిట్‌ అయిన బంజారా చిత్రం ‘గోర్‌ జీవన్‌’ తర్వాత అంతగా మనసు లగ్నం చేసి ‘రాం నాయక్‌’ చిత్రానికి సంగీతం సమకూర్చాను. నాకు మంచి పేరు తీసుకువస్తుందనుకుంటున్నాను’’ అన్నారు భోలే షావలి.  ఈ చిత్రానికి కెమెరా: శ్రావణ్‌ కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement