గ్యాంగ్‌ వార్‌

Ram Gopal Varma Unveils Aagraham Movie Teaser In Mumbai - Sakshi

సుదీప్, సందీప్, రాజు, సుస్మిత ముఖ్య తారలుగా ఆర్‌.ఎస్‌. సురేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆగ్రహం’. ఎస్‌ఎస్‌ చెరుకూరి క్రియేషన్స్‌ పతాకంపై సందీప్‌ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ముంబైలో ఆవిష్కరించారు. ఆర్‌.ఎస్‌. సురేశ్‌ మాట్లాడుతూ– ‘‘రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే గ్యాంగ్‌స్టర్‌  కథాంశమిది. ఇందులోని 5 ఫైట్స్‌ చాలా బాగుంటాయి.

‘ఆఫీసర్, సర్కార్‌ 3’ చిత్రాల సంగీత దర్శకుడు రవిశంకర్‌ అందించిన ఆర్‌ఆర్‌ మా సినిమాకి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘పూర్తి యాక్షన్‌ అంశాలున్న చిత్రమిది. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ఆడారి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా ఫాస్ట్‌గా నిర్మించాం. జూలైలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు సందీప్‌ చెరుకూరి.  మూర్తి ఆడారి, సంగీత దర్శకుడు రవి శంకర్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌. రామకృష్ణ.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top