వర్మ దర్శకత్వంలో 'శశికళ' | Ram gopal Varma registered film title Shashikala | Sakshi
Sakshi News home page

వర్మ దర్శకత్వంలో 'శశికళ'

Dec 16 2016 1:54 PM | Updated on Sep 4 2017 10:53 PM

వర్మ దర్శకత్వంలో 'శశికళ'

వర్మ దర్శకత్వంలో 'శశికళ'

దేశవ్యాప్తంగా ఏ భారీ సంఘటన జరిగినా సినీ రంగం నుంచి ముందుగా స్పందించే వ్యక్తి రాంగోపాల్ వర్మ. అయితే వర్మ స్పందనపై విమర్శలే ఎక్కువగా వినిపిస్తుంటాయి.

దేశవ్యాప్తంగా ఏ భారీ సంఘటన జరిగినా సినీ రంగం నుంచి ముందుగా స్పందించే వ్యక్తి రాంగోపాల్ వర్మ. అయితే వర్మ స్పందనపై విమర్శలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ప్రతీ విషయాన్ని తన సినిమా కథ కోసం లేక పబ్లిసిటీ కోసమో వాడుకోవటం వర్మకు అలవాటు. తాజాగా తమిళనాట అమ్మ మరణం తరువాత రాజకీయ రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న శశికళ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ.

శశికళ పేరుతో సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఇప్పటికే రక్తచరిత్ర సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వర్మ ప్రస్తుతం వంగవీటి, నయీం లాంటి యాథార్థ కథలతో సినిమాలు రూపొందిస్తున్నాడు. అయితే శశికళ పేరుతో తెరకెక్కించే సినిమా మాత్రం పూర్తి కాల్పనిక కథతో తెరకెక్కిస్తున్నాడట. అది కూడా రాజకీయాలు లేని కథాశంతో.. వర్మ నిజంగానే రాజకీయాలకు అతీతంగా సినిమాను తెరకెక్కించాలని భావిస్తే ఈ సమయంలో ఆ పేరుతో సినిమాను ఎందుకు ఎనౌన్స్ చేశాడో.. వర్మకే తెలియాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement