‘వాళ్లందరికీ ఈ విజయం ఓ చెంప దెబ్బ’ | Ram Gopal Varma Lakshmis Ntr Vijayam Video Song | Sakshi
Sakshi News home page

‘వాళ్లందరికీ ఈ విజయం ఓ చెంప దెబ్బ’

Mar 20 2019 9:48 AM | Updated on Mar 20 2019 9:53 AM

Ram Gopal Varma Lakshmis Ntr Vijayam Video Song - Sakshi

లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో దర్శక నిర్మాత రామ్‌ గోపాల్‌ వర్మ ప్రచారంలో వేగం పెంచారు. ఇప్పటికే ట్రైలర్‌లు, పాటలతో ఆకట్టుకున్న వర్మ తాజా మరో పాటను విడుదల చేశాడు. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిలు విజయానందంలో ఉండగా వచ్చే పాటను బుధవారం రిలీజ్ చేశారు. వర్మ ఆస్తాన రచయిత సిరా శ్రీ సాహిత్యమందించిన ఈ పాటను కల్యాణీ మాలిక్‌ సంగీత సారధ్యం లెజెండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం, మోహన బోగరాజు ఆలపించారు.
(చదవండి : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు)

ఇప్పటికే తెలంగాణ హైకోర్టు తీర్పుతో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రిలీజ్‌కు చట్టపరమైన అడ్డంకులన్ని తొలగిపోయాయి. ముందుగా ఈ సినిమా మార్చి 22నే రిలీజ్ చేయాలని భావించినా.. నిర్మాణానంతర కార్యక్రమాలతో పాటు సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ కూడా పూర్తి కాకపోవటంతో సినిమాను వారం రోజులు ఆలస్యంగా మార్చి 29న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. అగస్త్య మంజుతో కలిసి వర్మ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరిలు నిర్మిస్తున్నారు.
(చదవండి : త్వరలో ఎన్టీఆర్‌ నైట్‌ : వెన్నుపోటు ఈవెంట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement