'గబ్బర్ సింగ్ కావాలి.. బెగ్గర్ సింగ్ కాదు' | Ram Gopal Varma comments on Pawan kalyan | Sakshi
Sakshi News home page

'గబ్బర్ సింగ్ కావాలి.. బెగ్గర్ సింగ్ కాదు'

May 1 2016 12:36 PM | Updated on Mar 23 2019 9:10 PM

'గబ్బర్ సింగ్ కావాలి.. బెగ్గర్ సింగ్ కాదు' - Sakshi

'గబ్బర్ సింగ్ కావాలి.. బెగ్గర్ సింగ్ కాదు'

సినిమాల కన్నా వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

హైదరాబాద్ :  సినిమాల కన్నా వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల పవన్ ఏపీకి 'ప్రత్యేక హోదా' విషయంలో పోరాటం చేయాలని సీమాంధ్ర ప్రజల తరఫున ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ ఎంపీలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. పవన్ విన్నపాన్ని ఎద్దేవా చేస్తూ రామ్ గోపాల్ వర్మ మాటల తూటాలతో విరుచుకుపడ్డారు.

'విజ్ఞప్తి కాదు.. డిమాండ్ చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది. ఫ్లాపైనా మాకు గబ్బర్ సింగ్ కావాలిగానీ.. బెగ్గర్ సింగ్ కాదు. అసలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాదు.. రియల్ స్టార్ కేటీఆర్' అంటూ ఘాటైన కామెంట్లు చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్కు, రామూకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజా కామెంట్లతో రామూ మరోసారి పవన్ ఫ్యాన్స్ను రెచ్చగొట్టినట్లయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement