లక్ష్మీస్ ఎన్టీఆర్ పై వర్మ ప్రకటన | Ram gopal varma about Laxmis NTR | Sakshi
Sakshi News home page

లక్ష్మీస్ ఎన్టీఆర్ పై వర్మ ప్రకటన

Oct 10 2017 1:14 PM | Updated on Oct 10 2017 3:23 PM

Rgv lakshmis NTR

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రానికి తెరతీశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమాను ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేసిన వర్మ, తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరులో సినిమాను అధికారికంగా ప్రకటించారు. నిర్మాత రాకేష్ రెడ్డితో  కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేశారు.

2018లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు. అక్టోబర్ నాటికి సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాంటిదన్న వర్మ, తమ సినిమాలో కేవలం ఒక అధ్యాయాన్ని మాత్రమే చూపిస్తామని తెలిపారు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి సినిమా మొదలవుతుందని తెలిపారు.

ఈ సినిమా కన్నా ముందు నిర్మాత రాకేష్ రెడ్డితో ఎలాంటి పరిచయం లేదన్న వర్మ, బాలకృష్ణ నిర్మించే ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వంలో వహించే అవకాశం లేదని అన్నారు. ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదని త్వరలోనే కీలక పాత్రధారులను ప్రకటిస్తామని తెలిపారు. తను కేవలం తనకు తెలిసిన ఎన్టీఆర్ జీవితాన్ని మాత్రమే చూపిస్తానని సినిమాలో ఎలాంటి రాజకీయ కోణం ఉండదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement