'కిక్ 2' ఎఫెక్ట్ | ram charan to be canceled surender reddy project | Sakshi
Sakshi News home page

'కిక్ 2' ఎఫెక్ట్

Sep 13 2015 10:46 AM | Updated on Sep 3 2017 9:20 AM

'కిక్ 2' ఎఫెక్ట్

'కిక్ 2' ఎఫెక్ట్

రేసుగుర్రం లాంటి భారీ హిట్ తరువాత మంచి ఫాంలో కనిపించిన సురేందర్ రెడ్డి నెక్ట్స్ సినిమాతోనే నిరాశపరిచాడు. భారీ అంచనాలతో కిక్ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కించిన కిక్ 2 సురేందర్ రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ మీద ఎఫెక్ట్...

రేసుగుర్రం లాంటి భారీ హిట్ తరువాత మంచి ఫాంలో కనిపించిన సురేందర్ రెడ్డి నెక్ట్స్ సినిమాతోనే నిరాశపరిచాడు. భారీ అంచనాలతో కిక్ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కించిన కిక్ 2 సురేందర్ రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. రేసుగుర్రం తరువాత చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు ఓకె చేసుకున్నా, ఇప్పుడా ప్రాజెక్ట్స్ అన్ని డైలామాలో పడ్డాయి.

ముఖ్యంగా కిక్ 2  షూటింగ్ సమయంలోనే రామ్చరణ్కు కథ వినిపించిన సూరి నెక్ట్స్ ఆ సినిమానే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావించాడు. సురేందర్ రెడ్డి చెప్పిన కథ నచ్చిన చరణ్ కూడా శ్రీనువైట్లతో చేస్తున్న బ్రూస్లీ సినిమా తరువాత అదే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే కిక్ 2 రిజల్ట్ సీన్ రివర్స్ చేసేసింది. సురేందర్ రెడ్డితో చేసే ప్రాజెక్ట్ విషయంలో చెర్రీ పునరాలోచనలో ఉన్నాడట.

బ్రూస్లీ సినిమా పూర్తి కావస్తుండటంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో సీరియస్గా ఆలోచిస్తున్న చరణ్ ముందు రెండు ఆఫ్షన్స్ ఉన్నాయి. సురేందర్ రెడ్డి సినిమాతో పాటు తమిళ్లో సూపర్ హిట్ అయిన తనీ ఒరువన్ రీమేక్. అయితే సూరి సినిమాతో రిస్క్ చేయటం కన్నా తనీఒరువన్ రీమేక్ చేయటమే బెటర్ అని భావిస్తున్నాడు చరణ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement