చెర్రీ నెక్ట్స్ మూవీ మెగా ఎక్స్ప్రెస్..? | Ram Charan, merlapaka Gandhi movie title mega express | Sakshi
Sakshi News home page

చెర్రీ నెక్ట్స్ మూవీ మెగా ఎక్స్ప్రెస్..?

Aug 24 2016 9:43 AM | Updated on Sep 4 2017 10:43 AM

చెర్రీ నెక్ట్స్ మూవీ మెగా ఎక్స్ప్రెస్..?

చెర్రీ నెక్ట్స్ మూవీ మెగా ఎక్స్ప్రెస్..?

ప్రస్తుతం ధృవ షూటింగ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150 నిర్మాణ పనులతో బిజీగా ఉన్న చరణ్, తన నెక్ట్స్ సినిమాలను కూడా లైన్లో...

ప్రస్తుతం ధృవ షూటింగ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150 నిర్మాణ పనులతో బిజీగా ఉన్న చరణ్, తన నెక్ట్స్ సినిమాలను కూడా లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే సుకుమార్, మేర్లపాక గాంధీల దర్శకత్వంలో సినిమాలు అంగీకరించిన మెగా పవర్ స్టార్, ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.
 
ధృవ పూర్తయిన నెల రోజులు తరువాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నాడు చరణ్. కేవలం మేకోవర్ కోసం ఈ గ్యాప్ తీసుకోనున్న చరణ్, ఆ తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయబోయే సినిమాను కూడా వెంటనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు ఈ సినిమాకు గాంధీ సెంటిమెంట్ను ఫాలో అవుతూ మెగా ఎక్స్ప్రెస్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. 
 
గతంలో మేర్లపాక గాంధీ తెరకెక్కించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలు మంచి విజయం సాధించాయి. అందకే చరణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు కూడా ఎక్స్ప్రెస్ అనే పదం వచ్చేలా మెగా ఎక్స్ప్రెస్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. మరి గాంధీ సెంటిమెంట్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement