నా మొదటి పోస్ట్‌ నీకే అంకితం: రామ్‌చరణ్‌ | Ram Charan Dedicates First Instagram Post To His Mom With Adorable Pic | Sakshi
Sakshi News home page

నా మొదటి పోస్ట్‌ నీకే అంకితం: రామ్‌చరణ్‌

Jul 12 2019 12:17 PM | Updated on Jul 12 2019 12:18 PM

Ram Charan Dedicates First Instagram Post To His Mom With Adorable Pic - Sakshi

‘కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు!! నా మొదటి పోస్టు నీకే అంకితం చేస్తున్నా. లవ్‌ యూ అమ్మా’ అంటూ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.  ఆల్రెడీ ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటున్న రామ్‌చరణ్‌...  ఇటీవలే ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తల్లి సురేఖ ఒడిలో సేద తీరుతున్న తన చిన్ననాటి, ప్రస్తుత ఫొటోను షేర్‌ చేసిన రామ్‌చరణ్‌ తొలి పోస్టును ఆమెకు అంకితం చేశాడు. #mamasboy, #forever అనే హ్యాష్‌ట్యాగ్‌లతో తల్లి పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. గంటలోపే లక్షకు పైగా లైకులు సాధించిన ఈ ఫొటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కాగా రామ్‌చరణ్‌ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా తండ్రి చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా ప్రొడక్షన్‌ పనులతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement