బ్యాంకాక్‌ టు హైదరాబాద్‌ | ram charan bangkok to hyderabad | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్‌ టు హైదరాబాద్‌

Jun 12 2018 12:19 AM | Updated on Jun 12 2018 12:19 AM

ram charan bangkok to hyderabad - Sakshi

రామ్‌ చరణ్‌

బ్యాంకాక్‌ నుంచి తిరిగొచ్చిన రామ్‌చరణ్‌ కుటుంబం మరికొన్ని రోజులు సకుటుంబ సపరివార సమేతంగా హైదరాబాద్‌లో సందడి చేయనుంది. మరి హైదరాబాద్‌లో మకాం ఎన్ని రోజులంటే పది రోజులకుపైనే అట. ఏం చెప్తున్నామో అర్థం కావట్లేదా?  రామ్‌ చరణ్‌ కొత్త చిత్రం షూటింగ్‌ విశేషాలండి. ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ యూనిట్‌ని ఫ్యామిలీయే అనుకుంటారు కదా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా డీవీవీ దానయ్య ఓ చిత్రం నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.

ఇందులో కియారా అద్వానీ కథానాయిక. స్నేహా, ఆర్యన్‌ రాజేశ్, ప్రశాంత్, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బ్యాంకాక్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసిన బృందం ఇప్పుడు హైదరాబాద్‌కి షిఫ్ట్‌ అయ్యారు. జూన్‌ 14 నుంచి స్టార్ట్‌ అయ్యే ఈ షెడ్యూల్‌లో ఫ్యామిలీ సీన్స్‌ షూట్‌ చేయనున్నారు. ఇందులో చరణ్, కియారాతో పాటు మిగతా తారాగణం పాల్గొననుంది. ఈ షెడ్యూల్‌ పదిహేను రోజులపాటు సాగనుంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement