రామ్‌ కొత్త సినిమా ఓపెనింగ్‌ | Ram And Praveen Sattaru New Movie Opening | Sakshi
Sakshi News home page

Apr 26 2018 12:36 PM | Updated on Apr 26 2018 12:36 PM

Ram And Praveen Sattaru New Movie Opening - Sakshi

యంగ్‌ హీరో రామ్‌ తన తదుపరి చిత్రాన్ని గరుడవేగ సినిమాతో ఘనవిజయం సాధించిన ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ రోజు (26-04-2018) పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇప్పటికే కాంబినేషన్‌ పరంగా మంచి హైప్ క్రియేట్‌ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకునే స్థాయిలో ఉంటుందంటున్నారు చిత్రయూనిట్‌.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ‘స్ర‌వంతి’ ర‌వికిశోర్ మాట్లాడుతూ ‘ఈ రోజు హైద‌రాబాద్‌లో నిరాడంబ‌రంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాం.  మే 7 నుంచి జార్జియాలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మే నెలాఖరు వ‌ర‌కు తొలి షెడ్యూల్ సాగుతుంది. ఆ త‌ర్వాత స్విట్జ‌ర్లాండ్‌, ఫ్రాన్స్, ఇట‌లీలోని సుంద‌రమైన ప్ర‌దేశాల్లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తాం.  విదేశాల నుంచి తిరిగి వ‌చ్చాక కాశ్మీర్‌, ల‌డ‌ఖ్‌లో భారీ షెడ్యూల్స్ చేస్తాం. న్యూ వేవ్ లో సాగే చిత్ర‌మిది. మ‌రిన్ని విశేషాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం’ అని చెప్పారు.  

ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు మాట్లాడుతూ ‘హీరో రామ్‌కి చ‌క్క‌గా స‌రిపోయే క‌థ కుదిరింది.  స్క్రిప్ట్ గ్రిప్పింగ్‌గా ఉంది. యాక్ష‌న్, అడ్వంచ‌ర‌స్ అంశాలు పుష్క‌లంగా ఉంటాయి. న్యూ వేవ్‌లో సాగే సినిమా.  మే నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెడ‌తాం. ప్ర‌ముఖ సాంకేతిక నిపుణులు, న‌టీన‌టులు మా చిత్రానికి ప‌నిచేస్తారు. అంద‌రినీ మెప్పించే సినిమా అవుతుంది’  అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement