అందులో చాలా అనుభవం వచ్చింది! | Rakul Preet Singh Share her Love Experience | Sakshi
Sakshi News home page

అందులో చాలా అనుభవం వచ్చింది!

Jan 24 2020 9:00 AM | Updated on Jan 24 2020 9:00 AM

Rakul Preet Singh Share her Love Experience - Sakshi

సినిమా: ప్రేమలో చాలా అనుభవం వచ్చింది అని అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లలో పలు చిత్రాల్లో నటించి క్రేజీ నటిగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడికిప్పుడు అంత క్రేజ్‌ లేదనుకోండి. అయితే అసలు అవకాశాలు లేకుండా మాత్రం లేదు. కోలీవుడ్‌లో అయితే శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌తో నటిస్తున్న చిత్రం ఒక్కటి మాత్రమే ఉంది. ఇక్కడ అమ్మడికి హిట్‌ అని చెప్పుకోవడానికి ధీరన్‌ అధికారం ఒండ్రు అనే చిత్రం ఒక్కటే. ఆ తరువాత నటించిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. ఇక టాలీవుడ్‌లో అయితే ఆ ఒక్క చిత్రం కూడా లేదు. హిందీలో ఒకటో, రెండో అవకాశాలు ఉన్నట్లున్నాయి. దీంతో ఎలాగైనా మళ్లీ నటిగా బిజీ కావాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే స్పెషల్‌ ఫొటో సెషన్లు చేయించుకుంటూ గ్లామరస్‌తో కూడిన ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తోంది. వీటిని కుర్రకారు ఎంజాయ్‌ చేస్తున్నా, కొందరు నెటిజన్లు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.

అయినా విమర్శలను పట్టించుకుంటే అనుకున్న పనిఅవుతుందా? అందుకే నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాత్రం ఇంటర్వ్యూలు, ఫొటోలు అంటూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేసుకుంటోంది. ఈ భామ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ  దక్షిణాదిలో చాలా చిత్రాల్లో నటించి పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అంతస్తును పొందానని చెప్పుకుంది. సీనియర్‌ హీరోల నుంచి వర్ధమాన హీరోల వరకూ జతకట్టానని చెప్పింది. దీంతో ప్రేమ గురించి తనను అడుగుతున్నారంది. ప్రేమ గురించి చెప్పాలంటే అది చాలా అందమైనది అని, అంతకన్నా చాలా లోతైనది అని పేర్కొంది. దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం అని అంది. అందుకే తాను ఇప్పుటి వరకూ ఎవరినీ ప్రేమించలేదని తెలిపింది. అయినా ప్రేమ గురించి తనకు బాగా తెలుసని అంది. ఒక్కో చిత్రంలో హీరోలను వెంట పడి మరీ ప్రేమించి ఏదో కోణంలో ప్రేమను టచ్‌ చేస్తున్నట్లు చెప్పింది. ఆ విధంగా ఒక్కో చిత్రంలోని ప్రేమ తనకు కొత్త అనుభవాన్ని కలిగిస్తోందని అంది. అలా తనకు ప్రేమలో చాలా అనుభవం ఉందని పేర్కొంది. సినిమా రంగంలోకి రాకుండా ప్రేమ గురించి చాలా విషయాలను తెలుసుకునే అవకాశం ఉండేది కాదని చెప్పింది. ఒక్కో చిత్రంలో ప్రేమ ఒక్కో అనుభవాన్నిస్తోందని అంది. ఒక కథా పాత్రలో నటించడం ఒక కొత్త జీవితాన్ని అనుభవించిన దానికి సమం అని పేర్కొంది. అలా సినీ పయనంలో ఎన్నో జీవితాలను అనుభవిస్తున్నానని నటి రకుల్‌ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement