మన్మథుడి భామ  | Rakul Preet Singh roped in for Manmadhudu 2? | Sakshi
Sakshi News home page

మన్మథుడి భామ 

Feb 27 2019 12:30 AM | Updated on Jul 15 2019 9:21 PM

 Rakul Preet Singh roped in for Manmadhudu 2? - Sakshi

మొదటి భాగంలో ఇద్దరి హీరోయిన్లతో సందడి చేసిన నాగార్జున సెకండ్‌ పార్ట్‌లోనూ ఇద్దరు హీరోయిన్ల్లతో రొమాన్స్‌ చేయనున్నారట. నాగార్జున సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ఒకటైన ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ చిత్రం తెరకెక్కనుంది. దర్శకుడిగా మారిన హీరో రాహుల్‌ రవీంద్రన్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్నారు.

ఫస్ట్‌ పార్ట్‌లో సోనాలీ బింద్రే, అన్షు నాయికలుగా నటించారు. సీక్వెల్‌లో రకుల్‌ ప్రీత్, పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ వచ్చే నెల రెండో వారంలో స్టార్ట్‌ కానుంది. ఎక్కువ శాతం పోర్చుగల్‌లో షూటింగ్‌ జరుపుకోనుంది.  

Advertisement
 
Advertisement
Advertisement