యుద్ధానికి వెళ్లినట్లుంది | Rakul Preet Singh on last day of shoot before industry-wide shutdown | Sakshi
Sakshi News home page

యుద్ధానికి వెళ్లినట్లుంది

Mar 22 2020 5:07 AM | Updated on Mar 22 2020 5:07 AM

Rakul Preet Singh on last day of shoot before industry-wide shutdown - Sakshi

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

ఇటీవల మూడు హిందీ సినిమాలకు (జాన్‌ అబ్రహాం ‘ఎటాక్‌’, అజయ్‌దేవగన్‌ – సిద్దార్ధ్‌ మల్హోత్రా ‘థ్యాంక్‌ గాడ్‌’, అర్జున్‌ కపూర్‌ సరసన ఓ సినిమా) సైన్‌ చేసి, బాలీవుడ్‌ ట్రాక్‌పై స్పీడ్‌ పెంచారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. అయితే కరోనా వైరస్‌ కారణంగా సినిమాల షూటింగ్స్‌ అన్నీ బంద్‌ అయిన సంగతి తెలిసిందే. సైన్‌ చేసిన సినిమాల షూటింగ్స్‌ అనుకున్న సమయానికి జరగకపోవడం వల్ల తన మూవీ కాల్షీట్లు క్లాష్‌ అవుతాయని కంగారు పడుతున్నారు రకుల్‌.

ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘కరోనా వైరస్‌ ప్రభావం లేకపోయినట్లయితే ఈ సమయంలో ప్రతిరోజూ నేను షూటింగ్స్‌లో పాల్గొనాల్సింది. కానీ షూటింగ్స్‌ అన్నీ క్యాన్సిల్‌ అయ్యాయి. బ్రేక్‌ తర్వాత ఒకేసారి షూటింగ్స్‌ మొదలైతే నా డేట్స్‌ను ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావడంలేదు. నా కెరీర్‌లో ఇది పెద్ద బ్రేక్‌. కరోనా వైరస్‌ ఇండస్ట్రీ మొత్తాన్ని కలవరపెడుతోంది. అసలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ఏదో యుద్ధానికి వెళ్లిన ఫీలింగ్‌ కలుగుతోంది’’ అన్నారు రకుల్‌.

Advertisement
 
Advertisement
Advertisement