వసూళ్ల వర్షం పడుతోంది | rakshasudu movie press meet | Sakshi
Sakshi News home page

వసూళ్ల వర్షం పడుతోంది

Aug 3 2019 3:51 AM | Updated on Aug 3 2019 12:45 PM

 rakshasudu movie press meet - Sakshi

అభిషేక్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కోనేరు సత్యనారాయణ, రమేష్‌ వర్మ, వాసు

‘‘ఈ రోజు నాకు చాలా మెమొరబుల్‌. ఇలాంటి రోజు కోసమే రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాను. నాకు ‘రాక్షసుడు’తో మంచి హిట్‌ ఇచ్చిన సత్యనారాయణగారికి రుణపడి ఉంటాను’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. రమేష్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రాక్షసుడు’. నిర్మాత అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని నిన్న (శుక్రవారం) విడుదల చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘అందరూ సినిమా గురించి పాజిటివ్‌గా చెబుతున్నారు. కమర్షియల్‌గానే కాదు.. క్రిటిక్స్‌ దగ్గర నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. సత్యనారాయణగారు ఖర్చుకు వెనకాడకుండా తెలుగు రీమేక్‌ రైట్స్‌ కొని మాపై నమ్మకంతో మాకు ఇవ్వడమే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ అని భావిస్తున్నాం. టీమ్‌ అంతా బాగా కష్టపడ్డాం. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు.‘‘నాపై నమ్మకంతో సినిమా చేసిన సత్యనారాయణగారికి, బెల్లంకొండ సురేశ్, హీరో సాయి శ్రీనివాస్‌కు థ్యాంక్స్‌. ఈ సినిమా రిజల్ట్‌ గురించి మూడు రోజులుగా టెన్షన్‌ పడ్డాను.

సినిమా చూసిన తర్వాత నా శ్రీమతి ఫోన్‌ చేసి ‘బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు’ అని చెప్పింది. నా సక్సెస్‌లో భాగమైన అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు రమేశ్‌ వర్మ. ‘‘ఈ సినిమాను రమేష్‌ వర్మ ఓ కసితో డైరెక్ట్‌ చేశాడు. సాయి కూడా ఈ సినిమాతో హిట్‌ కొట్టాలని వెయిట్‌ చేశాడు. మామూలు వర్షమే కాదు.. కలెక్షన్ల వర్షం కూడా పడుతోంది. సత్యనారా యణగారు మమ్మల్ని పట్టుదలగా ముందుకు నడిపించారు’’ అన్నారు అభిషేక్‌ నామా. ‘‘సాయి తన ఇమేజ్‌ను పక్కనపెట్టి కంటెంట్‌ ఉన్న సినిమా చేయడానికి అంగీకరించినప్పుడే సక్సెస్‌ డిసైడై పోయింది’’ అన్నారు మల్టీ డైమన్షన్‌ వాసు. సినిమా టోగ్రఫర్‌ వెంకట్‌ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement