రాఖీసావంత్ సోదరుడి దర్శకత్వంలో 'అమావాస్య' | Rakesh savanth to direct trilingual movie | Sakshi
Sakshi News home page

రాఖీసావంత్ సోదరుడి దర్శకత్వంలో 'అమావాస్య'

Sep 18 2013 12:52 AM | Updated on Aug 28 2018 4:30 PM

రాఖీసావంత్ సోదరుడి  దర్శకత్వంలో 'అమావాస్య' - Sakshi

రాఖీసావంత్ సోదరుడి దర్శకత్వంలో 'అమావాస్య'

బాలీవుడ్ గ్లామర్ తార రాఖీసావంత్ సోదరుడు రాకేష్ సావంత్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘అమావాస్య’ చిత్రం రూపొందుతోంది. ఆకాష్ హీరో.

బాలీవుడ్ గ్లామర్ తార రాఖీసావంత్ సోదరుడు రాకేష్ సావంత్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘అమావాస్య’ చిత్రం రూపొందుతోంది. ఆకాష్ హీరో.
 
 నృపుర్ మెహతా, రూబీ అహ్మద్, సోనమ్, ముమైత్‌ఖాన్, కోట తదితరులు ముఖ్యతారలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 
 
 ఈ సందర్భంగా రాకేష్ సావంత్ మాట్లాడుతూ -‘‘ఓ దుర్మార్గుడి చేతిలో మానప్రాణాలు పోగొట్టుకున్న ఓ యువజంట ప్రేతాత్మలుగా మారి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారన్నది ఈ సినిమా ప్రధాన కథాంశం. పాటల్ని త్వరలోనే విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ద్రిడ్ బసు, సంగీతం: సయ్యద్ అహ్మద్.

Advertisement
 
Advertisement
Advertisement