'రస్తుం'కు రజనీకాంత్ విషెస్ | Rajinikanth’s wishing Akshay Kumar’s Rustom success | Sakshi
Sakshi News home page

'రస్తుం'కు రజనీకాంత్ విషెస్

Aug 11 2016 11:15 AM | Updated on Sep 4 2017 8:52 AM

'రస్తుం'కు రజనీకాంత్ విషెస్

'రస్తుం'కు రజనీకాంత్ విషెస్

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం 'రుస్తుం' విజయవంతం కావాలని దక్షిణాది సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆకాంక్షించారు.

ముంబై: బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం 'రుస్తుం' విజయవంతం కావాలని దక్షిణాది సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆకాంక్షించారు. రుస్తుం సక్సెస్ కావాలని కోరుకుంటూ అక్షయ్ కుమార్ కు ట్విట్టర్ ద్వారా 'కబాలి' స్టార్ విషెస్ చెప్పారు. తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు రజనీకాంత్ కు అక్షయ్ కుమార్ ధన్యవాదాలు చెప్పాడు. ఆయన ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడినని పేర్కొన్నాడు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన 'రుస్తుం' శుక్రవారం విడుదల కానుంది.

1959లో నావికా దళంలో సేవలందించిన ఆఫీసర్ కేఎం నానావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నేవీ ఆఫీసర్ రుస్తుం పవ్రీగా నటిస్తున్నాడు. అతడి సరసన ఇలియానా హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ అగ్రతారలు సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, సోనమ్ కపూర్ కూడా 'రుస్తుం' విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కాగా, రజనీకాంత్ రోబో సీక్వెల్ '2.0'లో అక్షయ్‌ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement