రుషికేశ్‌లో రజనీకాంత్‌ | Rajinikanth in Rishikesh Near Himalayas | Sakshi
Sakshi News home page

రుషికేశ్‌లో రజనీకాంత్‌

Oct 15 2019 8:16 AM | Updated on Oct 15 2019 8:16 AM

Rajinikanth in Rishikesh Near Himalayas - Sakshi

రుషికేశ్‌లో రజనీకాంత్‌

తమిళనాడు,పెరంబూరు :నటుడు రజనీకాంత్‌ ఆదివారం చెన్నై నుంచి హిమాలయాలకు వెళ్లి, రుషికేశ్‌లోని స్వామీ దయానంద ఆశ్రమంలో బసచేశారు. సోమవారం ఉదయం అక్కడ రజనీకాంత్‌ అభిమానులు ఆయన్ని కలిసి ఫొటోలు దిగారు. రజనీకాంత్‌ 10 రోజుల పాటు  రుషికేశ్, కేధారనాథ్, బద్రినాథ్‌ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. అనంతరం హిమాలయాల్లోని బాబా మందిరంలో ధ్యానం చేసుకుని ప్రశాంతత పొంది చెన్నైకి రానున్నారు. కాగా శివ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్న కొత్త చిత్రంలో రజనీ నటించనున్నారు. రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 12న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుందని తాజా సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement