డాన్‌ ఆఫ్‌ ది డాన్స్‌! | Rajinikanth-Ranjith's 'Kaala' release date is finally here | Sakshi
Sakshi News home page

డాన్‌ ఆఫ్‌ ది డాన్స్‌!

Feb 11 2018 1:12 AM | Updated on Sep 12 2019 10:40 AM

Rajinikanth-Ranjith's 'Kaala' release date is finally here - Sakshi

రజనీకాంత్‌

డాన్స్‌ చాలామంది ఉండొచ్చు. కానీ డాన్స్‌నే డామినేట్‌ చేసే డాన్‌ ‘కాలా’. రజనీకాంత్‌ హీరోగా ‘కబాలి’ ఫేమ్‌ రంజిత్‌. పా దర్శకత్వంలో వండర్‌బార్‌ పతాకంపై దర్శక–నిర్మాత–నటుడు ధనుష్‌ నిర్మించిన చిత్రం ‘కాలా’. ఇందులో హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్, సముద్రఖని, నానా పటేకర్‌ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 27న రిలీజ్‌ చేయనున్నట్లు అధికారికంగా చిత్రబృందం ఎనౌన్స్‌ చేసింది.

‘బాషా’, ‘కబాలి’ సినిమాల్లో డాన్‌ రోల్‌ చేసిన రజనీ ‘కాలా’ చిత్రంలోనూ డాన్‌ పాత్ర చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా లుక్‌ ఇప్పటికే బాగా ఆకట్టుకుంది. ‘కాలా’ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు కాబట్టి రజనీ ‘2.0’ ఈ సమ్మర్‌లో రిలీజ్‌ అవ్వడం లేదన్నది ఫిక్స్‌ అన్నమాట. ఈ ‘2.0’ చిత్రాన్ని ఆగస్ట్‌ 15న విడుదల చేయాలనుకున్నారు. ఈ వార్త వచ్చి రెండు రోజులైందో లేదో ఇప్పుడు వేరే డేట్‌ వినిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారట.

Advertisement
 
Advertisement
Advertisement