సూపర్‌ స్టార్‌ మరో సినిమాకు ఓకె చెప్పాడా..? | Rajinikanth Next Movie With Director Murugadoss | Sakshi
Sakshi News home page

Dec 4 2018 10:15 AM | Updated on Dec 4 2018 10:15 AM

Rajinikanth Next Movie With Director Murugadoss - Sakshi

2.ఓ సినిమాతో సంచనాలు నమోదు చేస్తున్న సౌత్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ వరుసగా సినిమాలతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో పేట్ట షూటింగ్ పూర్తి చేసిన రజనీ, మరో సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీ 166వ చిత్రం తెరకెక్కనుంది.

విజయ్‌ హీరోగా సర్కార్‌ సినిమాతో కమర్షియల్‌ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మురుగదాస్‌ తొలిసారిగా రజనీ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న రజనీ, సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు చేసే మురుగదాస్‌ తోడైతే రజనీ పొలిటికల్‌ ఎంట్రీకి కూడా ప్లస్‌ అవుతుందంటున్నారు ఫ్యాన్స్‌.

Advertisement
 
Advertisement
Advertisement