సూపర్‌స్టార్‌ మేకప్‌మ్యాన్‌ కన్నుమూత | Rajinikanth Makeup Man Muthappa Passed Away | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌ మేకప్‌మ్యాన్‌ కన్నుమూత

Dec 18 2018 8:17 PM | Updated on Dec 18 2018 8:19 PM

Rajinikanth Makeup Man Muthappa Passed Away - Sakshi

రజనీకాంత్‌తో ముత్తప్ప(పాత చిత్రం)

దాదాపు 60 సంవత్సరాలుగా సినీరంగానికి సేవలు అందించిన ముత్తప్ప..

సాక్షి, చెన్నై : తమిళ చిత్ర పరిశ్రమలో గొప్ప మేకప్‌ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న ముత్తప్ప(75) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తలైవా రజనీకాంత్‌ సహా పలువురు ప్రముఖులు ముత్తప్ప నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

కాగా ఏవీఎం ముత్తప్పగా ప్రాచుర్యం పొందిన ముత్తప్ప 15 ఏళ్ల వయస్సులోనే చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. తమిళ స్టార్లు దివంగత శివాజీ గణేషన్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ వంటి దిగ్గజాలకు మేకప్‌ ఆర్టిస్టుగా పనిచేశారు. దాదాపు 60 సంవత్సరాలుగా సినీరంగానికి సేవలు అందించిన ముత్తప్ప చాలా ఏళ్లుగా రజనీకాంత్‌ వ్యక్తిగత మేకప్‌ ఆర్టిస్టుగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement