కాలా కాస్త ఎక్కువే | Rajinikanth Kaala runtime locked | Sakshi
Sakshi News home page

కాలా కాస్త ఎక్కువే

May 23 2018 12:48 AM | Updated on May 23 2018 12:48 AM

Rajinikanth  Kaala runtime locked - Sakshi

క్వాలిటీ అండ్‌ కంటెంట్‌ పరంగా సినిమాలో పవర్‌ ఉంటే నిడివి ఎంత ఉన్నా ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. అందుకు ‘అర్జున్‌ రెడ్డి, భరత్‌ అనే నేను, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మహానటి’ చిత్రాలే నిదర్శనం. ఈ సినిమాల నిడివి దాదాపు రెండున్నర గంటల పైమాటే. తాజాగా ఈ క్లబ్‌లోకి ‘కాలా’ కూడా చేరాడు. రజనీకాంత్‌ హీరోగా ‘కబాలి’ ఫేమ్‌ పా. రంజిత్‌ దర్శకత్వంలో హీరో ధనుష్‌ నిర్మించిన చిత్రం ‘కాలా’. ఈ సినిమా సెన్సార్‌ కంప్లీటైంది.

‘కాలా’ చిత్రం నిడివి 2గంటల 46 నిమిషాల 59 సెకన్లు. ఈ సినిమా సెకండాఫ్‌లో రజనీ రౌడీయిజం, డైలాగ్స్‌ సూపర్బ్‌గా ఉంటాయట. అందుకే ‘కాలా’ టీమ్‌ నిడివి తగ్గించేందుకు రాజీ పడలేదని టాక్‌. నానా పటేకర్‌ కీలక పాత్ర చేసిన ఈ సినిమాలో అంజలీ పాటిల్, హ్యూమా ఖురేషీ కథానాయికలు. ఈ సినిమా జూన్‌ 7న విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement