కలెక్షన్స్‌లో ‘కాలా’ అక్కడ టాప్‌ | Rajinikanth Kaala Movie Record Collections In Australia | Sakshi
Sakshi News home page

Jun 11 2018 4:30 PM | Updated on Jun 11 2018 5:03 PM

Rajinikanth Kaala Movie Record Collections In Australia - Sakshi

కాలాలో రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాకు టాక్‌తో సంబంధం ఉండదు. సినిమా విడుదలయ్యిందా.. రికార్డులు బద్దలయ్యాయా? లేదా? అన్నట్లు ఉంటుంది. తలైవాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. కాలా సినిమాకు తెలుగులో నెగిటివ్‌ టాక్‌ వచ్చినా.. తమిళనాట మాత్రం సినిమా దూసుకుపోతోంది. 

విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లను రాబట్టింది కాలా. ఓవర్సీస్‌లో కూడా సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆస్ట్రేలియాలో తొలి వారాంతానికి 2 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీంతో ఫస్ట్‌ వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా కాలా నిలిచింది. కాగా సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావత్‌’ సినిమా టాప్‌ ప్లేస్‌లో ఉంది. రానున్న రోజుల్లో కాలా మరిన్ని రికార్డులు తిరగరాస్తుందేమో చూడాలి. 

Advertisement
 
Advertisement
Advertisement