మరి రజనీ ఫ్యాన్స్‌ అంటే మామూలు విషయమా! | Rajinikanth Fan Made His Auto In 2pointO Style | Sakshi
Sakshi News home page

Dec 1 2018 9:04 AM | Updated on Dec 1 2018 9:26 AM

Rajinikanth Fan Made His Auto In 2pointO Style - Sakshi

తమ అభిమాన హీరో కోసం ఏమైనా చేయడానికి రెడీ అవుతారు ఫ్యాన్స్‌. తమ హీరో సినిమా హిట్‌ అయితే వారికి వచ్చే కిక్కే వేరు. అందులోనూ సౌత్‌లో అభిమానుల హడావిడి ఎక్కువ ఉంటుంది. తమ అభిమాన హీరోను దైవసమానులుగా భావిస్తారు. ఇక తమిళ నాట అయితే ఏకంగా విగ్రహాలు పెట్టి ఆరాధిస్తారు. రజనీ, విజయ్‌, అజిత్‌ లాంటి స్టార్లకు అక్కడ తిరుగులేని ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. 

అయితే ప్రస్తుతం రజనీ ‘2.ఓ’ ట్రెండ్‌ నడుస్తోంది. గురువారం విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో దూసుకుపోతుండటంతో తలైవా అభిమానుల ఆనందాలకు ఆకాశమే హద్దైంది. పాలాభిషేకాలు, ఒంటిపై రజనీ బొమ్మలు, భారీ కటౌట్లు ఇవన్నీ మామూలే ఐనా.. ఒక అభిమాని చేసిన చర్య మాత్రం సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘2.ఓ’లో మాదిరి సెల్‌ఫోన్లను తన ఆటోకు అతికించేసి.. ఆటో పైన చుట్టూ తుపాకులతో రజనీ బొమ్మను అరెంజ్‌ చేశాడు. ఇప్పుడు ఈ ఆటో వైరల్‌గా మారింది. మరి తలైవా ఫ్యాన్స్‌ అంటే అలాగే ఉంటారు అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు నెటిజన్లు. 

Advertisement
 
Advertisement
Advertisement