శంకర్‌ తర్వాత మురుగదాస్‌ : రజనీకాంత్‌ | Rajinikanth And Murugadoss At Darbar Audio Launch | Sakshi
Sakshi News home page

శంకర్‌ తర్వాత మురుగదాస్‌ : రజనీకాంత్‌

Dec 9 2019 12:56 AM | Updated on Dec 9 2019 2:05 PM

Rajinikanth And  Murugadoss At Darbar Audio Launch - Sakshi

రజనీకాంత్, మురుగదాస్‌

‘‘నేను తమిళనాడుకి వచ్చేటప్పుడు నాపై నమ్మకంతో ఇక్కడ అడుగు పెట్టించిన వారి నుంచి.. నాపై నమ్మకంతో సినిమాలు రూపొందించిన దర్శక–నిర్మాతలందరి నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదు. ఇప్పుడు ‘దర్బార్‌’తోనూ మీ నమ్మకాన్ని వమ్ము చేయను’’ అని హీరో రజనీకాంత్‌ అన్నారు. మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘దర్బార్‌’. లైకాప్రొడక్షన్స్ పతాకంపై ఎ.సుభాస్కరన్‌ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. నిర్మాత ఎవి.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. అనిరుద్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను చెన్నైలో విడుదల చేశారు. రజనీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘సుభాస్కరన్‌ నాకు మంచి స్నేహితుడు. తనొక నిర్మాతగానే మనకు తెలుసు. కానీ, లండన్‌లో తను పెద్ద బిజినెస్‌ మేన్‌.

తన నిర్మాణంలో శంకర్‌ దర్శకత్వంలో ‘2.0’ సినిమా చేస్తున్నప్పుడు మా బ్యానర్‌లో మరో సినిమా చేయాలనడంతో సరే అన్నాను. మురుగదాస్‌గారి ‘రమణ, గజినీ’ చిత్రాలు బాగా నచ్చాయి. అప్పుడే ఆయనతో సినిమా చేయాలనుకున్నాను కానీ ఇప్పటికి కుదిరింది. శంకర్‌లా ఎంటర్‌టై¯Œ మెంట్‌తో పాటు మెసేజ్‌ ఇచ్చే సినిమాలు చేసే మురుగదాస్‌తో పనిచేయం ఆనందంగా అనిపించింది. డిసెంబర్‌ 12న నా బర్త్‌డేని అభిమానులు సెలబ్రేట్‌ చేయవద్దు. ఆ డబ్బులతో పేదలకు, అనాథలకు సాయం చేయండి’’ అన్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ మాట్లాడుతూ ‘‘నాకు ఊహ తెలిసి మా ఊరిలో థియేటర్‌లో నేను చూసిన హీరో రజనీకాంత్‌గారే. ఆయనతో సినిమా తీయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకుల్లాగా నేను కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు డైరెక్టర్‌ శంకర్‌. ‘‘2.0’ తర్వాత రజనీకాంత్‌గారితో మా బ్యానర్‌లో చేసిన చిత్రం ‘దర్బార్‌’’ అన్నారు ఎ.సుభాస్కరన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement