జస్ట్‌ చెకప్‌ మచ్చీ | rajinikanth America tour Soon | Sakshi
Sakshi News home page

జస్ట్‌ చెకప్‌ మచ్చీ

Apr 24 2018 12:53 AM | Updated on Sep 12 2019 10:40 AM

rajinikanth America tour Soon - Sakshi

రజనీకాంత్‌

రజనీకాంత్‌ రెండు వారాలపాటు అమెరికాలో ఉంటారు. షూటింగ్‌ కోసం కాదు. మెడికల్‌ చెకప్‌ కోసం. మెడికల్‌ చెకప్‌ కోసమా? తలైవర్‌ (నాయకుడు – అభిమానులు అలానే పిలుస్తారు)కి ఏమైంది? అని కంగారుపడకండి. తలైవర్‌ రొంబ (బాగా) ఆరోగ్యంగానే ఉన్నారు. ఇది జస్ట్‌ రెగ్యులర్‌ మెడికల్‌ చెకప్పే మచ్చీ. రజనీ ప్రతి సంవత్సరం మెడికల్‌ చెకప్‌ కోసం అమెరికా వెళ్తారన్న విషయం తెలిసిందే. అలాగే ఈసారి అమెరికా ప్రయాణం అయ్యారు.

రజనీతో పాటు ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా వెళ్లారని సమాచారం. మే సెకండ్‌ వీక్‌ వరకూ అమెరికాలోనే ఉంటారట రజనీకాంత్‌. తిరిగి రాగానే తన లేటెస్ట్‌ గ్యాంగ్‌స్టర్‌ మూవీ ‘కాలా’ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటారట. పా.రంజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వండర్‌బార్‌ ఫిల్మ్‌ పతాకంపై ధనుష్‌ నిర్మించారు. మామ రజనీ సినిమాను అల్లుడు ధనుష్‌ నిర్మించడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. ‘కాలా’ సినిమా ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా రంజాన్‌ స్పెషల్‌గా జూన్‌ 7న రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement