అ! దర్శకుడితో రాజశేఖర్‌ | Rajasekhar To Team Up With Awe Director Prasanth Varma | Sakshi
Sakshi News home page

Apr 26 2018 10:40 AM | Updated on Apr 26 2018 2:37 PM

Rajasekhar To Team Up With Awe Director Prasanth Varma - Sakshi

చాలా కాలం తరువాత సీనియర్‌ హీరో రాజశేఖర్‌పీఎస్‌వీ గరుడవేగ 126.18 ఎం’ సినిమాతో ఘనవిజయం సాధించారు. ఈ సక‍్సెస్‌ తరువాత సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న యాంగ్రీ హీరో త్వరలోనే తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నారట. కొత్త సినిమా కూడా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తోనే ఉండనుందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ప్రయోగాత్మకంగా తెరకెక్కిన అ! సినిమాతో పరిచయం అయిన దర్శకుడు  ప్రశాంత్‌ వర్మ. ఈ యువ దర్శకుడు రాజశేఖర్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు కల్కి అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారు. జూన్‌ లేదా జూలై మాసాల్లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెల్లనుంది. ఈ సినిమాతో పాటు కోలీవుడ్ మహిళా దర్శకురాలు ఐశ్వర్య ధనుష్‌ దర్శకత్వంలో ఒక సినిమా, మరో మల్టీ స్టారర్‌ సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఈ వరుస సినిమాలతో రాజశేఖర్‌ తిరిగి ఘన వైభవాన్ని అందుకుంటాడేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement