రాజశేఖర్ ‘అ’సమ్‌! | Rajasekhar Next Movie With Awe Fame Prashanth Varma | Sakshi
Sakshi News home page

Jun 29 2018 11:41 AM | Updated on Jun 29 2018 11:42 AM

Rajasekhar Next Movie With Awe Fame Prashanth Varma - Sakshi

సీనియర్ హీరో రాజశేఖర్‌ చాలా కాలం తరువాత గరుడవేగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తరువాత తదుపరి చిత్రాన్ని చేసేం‍దుకు చాలా సమయం తీసుకుంటున్నారు. ఆ సక్సెస్‌ ట్రాక్‌ను కంటిన్యూ చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. చాలా రోజులుగా రాజశేఖర్‌ చేయబోయే సినిమాలపై రకరకాల వార్తలు వినిపిస్తున్నా.. అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.

తాజాగా తాను చేయబోయే సినిమాపై ఈ యాంగ్రీ హీరో ఓ హింట్‌ ఇచ్చారు. ‘నా నెక్ట్స్ ప్రాజెక్టు గురించి నేను చెప్పగలిగింది ఒక్కటే. ఆ సినిమా ఆసమ్‌ (AWEsome) గా ఉండబోతోంది’. అంటూ తన ట్విటర్‌ పేజ్‌లో కామెంట్‌ చేశారు. దీంతో రాజశేఖర్ తదుపరి చిత్రం అ! (Awe) చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలోనే అన్న క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం వర్మ ప్రస్తుతం తమన్నా లీడ్‌ రోల్‌ తెరకెక్కుతున్న క్వీన్‌ రీమేక్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే రాజశేఖర్‌ సినిమా పనులు ప్రారంభించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement