ధృవ ట్రైలర్పై రాజమౌళి కామెంట్ | Rajamouli Praises Ram Charan Dhruva Trailer | Sakshi
Sakshi News home page

ధృవ ట్రైలర్పై రాజమౌళి కామెంట్

Nov 26 2016 10:24 AM | Updated on Jul 23 2019 11:50 AM

ధృవ ట్రైలర్పై రాజమౌళి కామెంట్ - Sakshi

ధృవ ట్రైలర్పై రాజమౌళి కామెంట్

రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ధృవ టీజర్ శుక్రవారం రిలీజ్ అయ్యింది

రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ధృవ ట్రైలర్ శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఆన్లైన్లో రిలీజ్ అయిన గంటల్లోనే లక్షల వ్యూస్తో సత్తా చాటిన ఈ ట్రైలర్ పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా తనకు బాగా నచ్చిన ట్రైలర్లు, సినిమాలను చిన్నపాటి రివ్యూలతో ప్రశంసించే టాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి, ధృవ టీంను అభినందించారు. తన ట్విటర్ పేజ్లో ధృవ ట్రైలర్ లింక్తో పాటు అభినందనలు తెలియజేశారు.

'చాలా స్టైలిష్, ఎంతో ప్రామిసింగ్, సురేందర్ రెడ్డి, చరణ్లకు అభినందనలు. అంచనాలకు మించి ఉంది ట్రైలర్, నిజానికి రీమేక్ సినిమాలు చేయటం చాలా కష్టం' అంటూ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఒరిజినల్ వర్షన్లో విలన్గా నటించిన అరవింద్ స్వామి మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ధృవ డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement