మనమంతాపై రాజమౌళి రివ్యూ | Rajamouli Comments on manamantha | Sakshi
Sakshi News home page

మనమంతాపై రాజమౌళి రివ్యూ

Aug 5 2016 2:00 PM | Updated on Jul 14 2019 4:05 PM

మనమంతాపై రాజమౌళి రివ్యూ - Sakshi

మనమంతాపై రాజమౌళి రివ్యూ

మంచి సినిమాలను తన స్టైల్లో ప్రమోట్ చేసే దర్శక ధీరుడు రాజమౌళి మనమంత సినిమాపై రివ్యూ రాశాడు. ప్రతీ సినిమా విషయంలో కేవలం కామెంట్స్కే పరిమితమయ్యే జక్కన్న.. మనమంతా సినిమాపై మాత్రం...

మంచి సినిమాలను తన స్టైల్లో ప్రమోట్ చేసే దర్శక ధీరుడు రాజమౌళి మనమంత సినిమాపై రివ్యూ రాశాడు. ప్రతీ సినిమా విషయంలో కేవలం కామెంట్స్కే పరిమితమయ్యే జక్కన్న.. మనమంతా సినిమాపై మాత్రం ఓ చిన్నపాటి రివ్యూనే రాశాడు. చిత్ర నటీనటులు, సాకేంతిక నిపుణులను అభినందించాడు.

'మనమంతా.. చంద్రశేఖర్ ఏలేటి, వారాహి చలన చిత్రం బ్యానర్ల కెరీర్లో టాప్ క్లాస్ సినిమాగా మిగిలిపోతుంది. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి నటీనటుల నుంచి అద్భుతమైన పర్ఫామెన్స్ను రాబ్టటాడు.  మోహన్ లాల్ లాంటి మహానటుడి నుంచి నాలుగేళ్ల చిన్నారి వరకు అందరూ మనల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, చాలా కాలం పాటు మన మనసుల్లో.. ఆలోచనల్లో నిలిచిపోతారు.

సినిమాలోని ప్రతీ అంశం సినీ రంగంలో అడుగుపెట్టాలనుకునే వారికి టెక్స్ట్ బుక్ లాంటిది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరు మేమూ మనమంతా సినిమాకు పనిచేశాం అని గర్వంగా చెప్పుకుంటారు'. అంటూ సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కేవలం ఈసినిమా చూడటం కోసం బాహుబలి షూటింగ్ కూడా బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి.

 

Advertisement
 
Advertisement
Advertisement