రాజమౌళి సోదరుడి దర్శకత్వంలో కాట్చినేరం | Rajamouli brother directed by katcineram | Sakshi
Sakshi News home page

రాజమౌళి సోదరుడి దర్శకత్వంలో కాట్చినేరం

Nov 4 2016 2:48 AM | Updated on Jul 14 2019 4:18 PM

రాజమౌళి సోదరుడి దర్శకత్వంలో కాట్చినేరం - Sakshi

రాజమౌళి సోదరుడి దర్శకత్వంలో కాట్చినేరం

బాహుబలి చిత్రం ఫేమ్ ఎస్‌ఎస్.రాజమౌళి అన్నయ్య ఎస్‌ఎస్.కాంచి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాట్చినేరం.

బాహుబలి చిత్రం ఫేమ్ ఎస్‌ఎస్.రాజమౌళి అన్నయ్య ఎస్‌ఎస్.కాంచి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాట్చినేరం. ఆయన తెలుగులో ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ అన్నది గమనార్హం. రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకు ఈయన భాగం ఉంటుంది. ఈ చిత్రానికి ఎస్‌ఎస్.కాంచి కథ, కథనం, మాటలు దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రామారీల్స్ పతాకంపై సుధీర్ పూతోట నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణధీర్ హీరోగానూ రుక్షర్ మీరా హీరోయిన్‌గానూ నటిస్తున్నారు.

మరగదమణి(కీరవాణి)  సంగీతాన్ని, కే.భూపతి చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ చక్కటి సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నం అయిన సమాజం ప్రస్తుతం ఎలా భ్రష్టు పట్టి పోతుందన్నది విజువల్ రూపంలో తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం కాట్జినేరం అన్నారు. ఒక నాగరిక దంపతుల ఇతి వృత్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో చదువుకున్న నలుగురు అనాగరిక వ్యక్తులకు, నాగరిక దంపతులకు మధ్య ఏర్పడే అనూహ్య సమస్య ఎలాంటి విపరీతాలకు దారి తీసిందన్నదే కాట్చినేరం చిత్రం అని తెలిపారు. ఈ చిత్రం తరువాత ఇదే చిత్ర నిర్మాణ సంస్థ భరత్ కథానాయకుడిగా కడసీ బెంచ్ కార్తీ అనే చిత్రాన్ని తెరకెక్కించనుందన్నది గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement