విజయం ఖాయం | Raja Narasimha Telugu Movie Press Meet | Sakshi
Sakshi News home page

విజయం ఖాయం

Published Tue, Dec 31 2019 2:09 AM | Last Updated on Tue, Dec 31 2019 2:09 AM

Raja Narasimha Telugu Movie Press Meet - Sakshi

‘‘కొన్నేళ్లుగా పంపిణీ రంగంలో ఉన్నాం. ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’, ‘రేసుగుర్రం’ వంటి హిట్‌ చిత్రాలను పంపిణీ చేశాం. ఆ అనుభవంతోనే నిర్మాణరంగంలో అడుగుపెట్టి తొలి ప్రయత్నంగా ‘మధుర రాజా’ చిత్రాన్ని తెలుగులో ‘రాజా నరసింహా’గా అనువదించాం. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలన్నదే మా లక్ష్యం’’ అని నిర్మాత సాధు శేఖర్‌ అన్నారు. మమ్ముట్టి హీరోగా ‘మన్యం పులి’ ఫేం వైశాఖ్‌ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్‌ కీలక పాత్రల్లో, జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు.

ఈ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ పేరుతో జై  చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై సాధు శేఖర్‌ రేపు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ– ‘‘నిర్మాతగా తొలి సినిమా ఇది. కల్తీ సారా వ్యాపారంతో అమాయకుల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తికి ఆ ప్రాంతానికి అండగా నిలిచే రాజా ఎలా బుద్ధి చెప్పాడు అన్నదే కథాంశం. పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. చక్కని సందేశం కూడా ఉంది. సన్నీ లియో¯Œ ప్రత్యేక గీతం అదనపు ఆకర్షణ. మా చిత్రం గ్యారెంటీగా హిట్‌ అవుతుంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement