ఆమె అభినందనను మరవలేను | Raj TV company, Lifetime Achievement Award | Sakshi
Sakshi News home page

ఆమె అభినందనను మరవలేను

Mar 10 2016 3:05 AM | Updated on Apr 3 2019 9:17 PM

ఆమె అభినందనను మరవలేను - Sakshi

ఆమె అభినందనను మరవలేను

ముఖ్యమంత్రి అమ్మ (జయలలిత) అభినందనను ఎప్పటికీ మరవలేనని సీనియర్ నటి అభినేత్రి వాణిశ్రీ వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి అమ్మ (జయలలిత) అభినందనను ఎప్పటికీ మరవలేనని సీనియర్ నటి అభినేత్రి వాణిశ్రీ వ్యాఖ్యానించారు. ఎమ్జీఆర్, ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, శివాజీగణేశన్ లాంటి గొప్ప నటులతో పోటీపడి నటించిన నాటి మేటి నటి వాణిశ్రీ. ఈమెను ప్రపంచ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ టీవీ సంస్థ జీవిత సాఫల్య అవార్డుతో సత్కరించారు. ఇటీవల నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాణిశ్రీ మాట్లాడుతూ తాను ఎలాంటి సినీ నేపథ్యం లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చానని తెలిపారు.
 
  చదువుకోవడానికి చెన్నై వచ్చి నృత్యం నేర్చుకున్నానని చెప్పారు. అలా నటినయ్యే అవకాశం వచ్చిందని అన్నారు. మా ముందు తరం నటీమణులు ఎలా దుస్తులు ధరిస్తున్నారు,వారి హేర్ స్టైల్ ఎలా ఉంటుందీ,సంబాషణలు ఎలా ఉచ్ఛరిస్తున్నారు త దితర అంశాలను గమనించి నేరుచకున్నానన్నారు.తాను శివాజీగణేశన్,ఎమ్జీఆర్ లాంటి గొప్ప నటులతో కలిసి నటించాననీ,అయినా అప్పట్లో తనకెలాంటి అవార్డులు రాలేదనీ అన్నారు.అలాంటిది ఇన్నేళ్లుగా తనను గుర్తు పెట్టుకుని ఈ జీవిత సాఫల్య అవార్డుతో సత్కరించిన రాజ్ టీవీ సంస్థ అధినేతలకు కృతజ్ఞలు తెలుపుకుంటున్నానన్నారు.
 
 అమ్మ అభినందనలు
 తాను తన కొడుకు, కూతుర్లను వైద్య విద్య చదివించానని,వారిప్పుడు పలువురికి సాయం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి అమ్మ పలిపించి అభినందించారని చెప్పారు.చిత్ర రంగానికి చెందిన మీరు కుటుంబ సభ్యుల్ని డాక్టర్లను చేయడం గర్వంగా ఉందని అమ్మ అభినందించడం జీవితంలో మరచిపోలేనన్నారు. సినీ కాళాకారులకు ఆరోగ్యం,ప్రశాంతత చాలా ముఖ్యం అన్నారు. అవి ఏ అంగడిలోనో లభించవని, మీలోనే ఉంటాయని అన్నారు.వాటిని మీ నుంచే మీరు పొందాలని వాణిశ్రీ సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement