రాణా.. త్రిషల మధ్య ఆ రాగిణి ఎవరు? | Ragini behind Rana Trisha break-up? | Sakshi
Sakshi News home page

రాణా.. త్రిషల మధ్య ఆ రాగిణి ఎవరు?

Oct 29 2014 3:23 PM | Updated on Sep 2 2017 3:34 PM

రాణా.. త్రిషల మధ్య ఆ రాగిణి ఎవరు?

రాణా.. త్రిషల మధ్య ఆ రాగిణి ఎవరు?

ఎన్నాళ్ల నుంచో స్నేహంగా ఉంటున్న రాణా.. త్రిషలు ఎందుకు విడిపోయారు?

ఎన్నాళ్ల నుంచో స్నేహంగా ఉంటున్న రాణా.. త్రిషలు ఎందుకు విడిపోయారు? వాళ్లిద్దరి మధ్య విభేదాలకు కారణం ఎవరు? అనధికారికంగా వస్తున్న కథనాల ప్రకారం, కన్నడ సుందరి రాగిణీ ద్వివేది కారణంగానే ఇలా జరిగిందని వినిపిస్తోంది. బాహుబలిలో నటిస్తున్న రాణా గతంలో రాగిణితో కలిసి ఉన్నట్లుగా ఉన్న ఫొటోలు సైతం కొన్ని వెబ్సైట్లలో దర్శనమిచ్చాయి.

అయితే, రాగిణి మాత్రం.. ఇవన్నీ ఒట్టి వదంతులేనని రాగిణి చెబుతోంది. ఏదో అవార్డు కార్యక్రమానికి జరిగిన రిహార్సల్స్లో తాము పాల్గొన్న ఫొటోను తీసుకుని ఇలా అంటగట్టేస్తున్నారని రాగిణి వాపోయింది. అసలు రాణాతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసింది. ఈ వ్యవహారాలపై రాణా కూడా తీవ్రంగానే స్పందించాడు. ఏదో ఒక ఫొటో తీసేసుకుని.. దాన్నుంచి వార్తలు వండటం చాలా దారుణమైన విషయమని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. త్రిష, రాణా కలిసి ఇటీవల సైమా అవార్డుల కార్యక్రమంలో కనిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement