మాజీ భర్త కుటుంబాన్ని క్లిక్‌మనిపించిన నటి! | Raghu Ram Shares His New Born Son Pics Clicked By Ex Wife Sugandha Garg | Sakshi
Sakshi News home page

మాజీ భర్తకు తండ్రిగా ప్రమోషన్‌.. నటి విషెస్‌!

Jan 20 2020 4:58 PM | Updated on Jan 20 2020 5:30 PM

Raghu Ram Shares His New Born Son Pics Clicked By Ex Wife Sugandha Garg - Sakshi

టెలివిజన్‌ నిర్మాత, నటుడు రఘురాం, అతడి భార్య కెనడియన్‌ సింగర్‌ నటాలీ డి లూసియోలు తమ కుమారుడు రిథమ్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఈ ముగ్గరి ఫొటోలను రఘురాం మాజీ భార్య, టీవీ నటి సుగంధ గార్గ్‌... వీరి ఫొటో షూట్‌ను నిర్వహించారు‌. తన కుమారుడు రిథమ్‌తో కలిసి ఉన్న ఫొటోలతో పాటు, భార్య నటాలి డి లూసియోతో కలిసి ఉన్న ఫొటోలకు ‘ప్రెజెంటింగ్‌.. ప్రౌడ్‌ పేరెంట్స్‌, బేబీ రిథమ్‌, డ్యాడీ లైఫ్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేసి షేర్‌ చేశారు. కాగా ఈ పోస్టుకు ‘ఈ ఫొటోలను తీసినందుకు ధన్యవాదాలు’ అంటూ మాజీ భార్య సుగంధకు రఘురాం కృతజ్ఞతలు తెలిపారు. సుగంధ జార్గ్‌ తీసిన ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతూ ‘రిథమ్‌ ఎంత ముద్దుగా ఉన్నాడు’ అని కామెంట్‌ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది జనవరి 6వ తేదిన రఘురాం భార్య నటాలి.. రిథమ్‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. (అందుకే నా కొడుకుకు ఆ పేరు: నటుడు)

ఇక రఘురాం షేర్‌ చేసిన ఈ పోస్టుకు ఆయన మాజీ భార్య సుగంధ గార్గ్‌.. ఆయనకు, నటాలికి హృదయపూర్వక శుభకాంక్షలు తెలిపారు. ‘ ఈ ఫోటో గడిచిన జ్ఞాపకాలకు గుర్తు... వెల్‌కమ్‌ రిథమ్‌. నువ్వు యోధులకు జన్మించావు’ అంటూ రాసుకొచ్చారు. ఇక 2006లో సుగంధ గార్గ్‌, రఘురాంలు వివాహవ చేసుకోగా, 2016లో వీరిద్దరూ విడుకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2018లో కెనడియన్‌ సింగర్‌ నటాలిని ఆయన వివాహం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement