అందుకే నా కొడుకుకు ఆ పేరు: నటుడు

Raghu Ram Share First Pic Of Son Reveals His Name In Poetic Way - Sakshi

‘సృజనాత్మకత చిగురులు తొడిగే క్షణంలో నేను పుట్టాను... కాంతిలా.. ప్రేమలా విశ్వంలో వ్యాప్తి చెందుతాను... జీవన ప్రవాహపు ప్రతీ అలలోనూ నేను కనబడతాను... ప్రతీ హృదయపు లయలో.. ప్రతీ పాటలో నేను వినిపిస్తాను.... వాన చినుకులు ముఖాన్ని తాకుతున్నపుడు.. ఆస్వాదించే స్వర్గంలో... రుతువులు మారే సమయంలో కనిపిస్తాను... నేను ఏ ఒక్క సంస్కృతికో పరిమితం కాను... దేశాలు.. ఖండాలను దాటి ఉంటుంది నా పరిధి.... నేను ప్రపంచ వ్యాప్తం... నన్నెవరూ నిర్వచించలేరు... నేను అమరం.. నేను రిథమ్‌’ అంటూ ప్రముఖ రియాలిటీ షోలు రోడీస్‌, స్ల్పిట్స్‌విల్లాల రూపకర్త, ప్రొడ్యూసర్‌ రఘురాం దంపతులు తమ కుమారుడిని ప్రపంచానికి పరిచయం చేశారు. తన తొలి ఫొటోను షేర్‌ చేస్తూ.. అతడి పేరును కవితాత్మకంగా అభిమానులతో పంచుకున్నారు. 

కాగా ఎమ్‌టీవీ రియాలిటీ షోల ద్వారా గుర్తింపు పొందిన రఘురాం.. కెనడియన్‌ సింగర్‌ నటాలియో డి లూసీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట జనవరి 6న కుమారుడికి జన్మనిచ్చింది. అతడికి రిథమ్‌గా నామకరణం చేసిన వీరు.. శుక్రవారం తొలిసారిగా తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ క్రమంలో ఈ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక తన కొడుకుకు రిథమ్‌ అనే పేరును ఎంపిక చేయడం గురించి రఘురాం మాట్లాడుతూ... ‘ విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న భాషలతో ముడిపడి... మా కలయికను ప్రతిబింబించేలా ఉన్న పేరు కోసం అన్వేషించాం. రిథమ్‌ అనే పేరు సరిగ్గా సరిపోతుందని భావించాం. ముఖ్యంగా ఇది ఏ మతంతోనూ ముడిపడిన పేరు కాదు’ అని పేర్కొన్నాడు. కాగా రఘురాం 2006లో నటి సుగంధ గార్గ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2018లో సుగంధతో విడాకులు తీసుకున్న రఘురాం.. ఆ తర్వాత నటాలియోతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక రియాలిటీ షోలతో పాటు తీస్‌మార్‌ ఖాన్‌, జూటా హై సాహి వంటి సినిమాల ద్వారా రఘురాం నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top