లారెన్స్‌ దాతృత్వం.. మొదటి ఇళ్లు ఆమెకే కట్టిస్తాడట!

raghava Lawrence Wants To Construct Home For Gaja Cyclone affected - Sakshi

ఇటీవలె తమిళనాడులో గజ తుపాను సృష్టించిన బీభత్సం గురించి తెలిసిందే. దీని ధాటికి ఎంతో మంది వీదిన పడ్డారు. ఎంతో ఆస్తి​ నష్టంతో పాటు.. ప్రాణనష్టమూ సంభవించింది. అయితే వీరిని ఆదుకోవడానికి తమిళ సినీ ప్రముఖులు ఎంతో మంది ముందుకువచ్చారు. 

గజ తుపాను ధాటికి ఓ వృద్దురాలి ఇళ్లు కూలిపోయింది.అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ.. రాఘవ లారెన్స్‌ కంటపడింది. తుపాను బాధితులకు అండగా.. ఓ యాభై మందికి ఇళ్లు నిర్మించి ఇస్తానని ప్రకటించారు. అందులో భాగంగా మొదటి ఇళ్లును ఆ వృద్దురాలికే కట్టిస్తానని మాటిచ్చారట. ఇంకా ఎవరైనా ఆపదలో ఉంటే.. తనకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top