ఏప్రిల్‌ 19న ‘కాంచన 3’ | Raghava Lawrence Kanchana 3 Release Date Announced | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 19న ‘కాంచన 3’

Mar 16 2019 10:53 AM | Updated on Mar 16 2019 10:53 AM

Raghava Lawrence Kanchana 3 Release Date Announced - Sakshi

సౌత్‌లో సూపర్‌ హిట్ జానర్‌ అనిపించుకున్న హరర్‌ కామెడీ జానర్‌లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. వరుసగా హారర్‌ సినిమాలతో సత్తా చాటుతున్న కోలీవుడ్ డాన్సింగ్ స్టార్‌ రాఘవా లారెన్స్‌ మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ‘ముని’ సిరీస్‌లో ‘కాంచన 3’ రెడీ అవుతోంది. లారెన్స్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగులో లైట్‌హౌస్‌ మూవీమేకర్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్‌ బ్యానర్‌లో రాఘవ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, కబీర్‌ దుహన్‌ సింగ్, సత్యరాజ్, శ్రీమాన్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ సినిమా ఫస్ట్‌లుకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇటీవల ఈ సినిమాను మే 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు ముందుగానే పూర్తవుతుండటంతో ఏప్రిల్ లోనే సినిమాను రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించారు. ఏప్రిల్ 19న కాంచన 3 ప్రేక్షకుల ముందుకు కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement