చిన్నితెర పెద్ద రికార్డ్‌! | Radhika has a new record | Sakshi
Sakshi News home page

చిన్నితెర పెద్ద రికార్డ్‌!

Mar 10 2019 12:36 AM | Updated on Mar 10 2019 12:36 AM

Radhika has a new record - Sakshi

రాధిక

పెద్ద తెర మీద ఎంత పాపులారిటీ సంపాదించారో బుల్లి తెర మీదా అంతే సంఖ్యలో అభిమానులను అలరించారు సీనియర్‌ నటి రాధిక. తాజాగా బుల్లితెర మీద పెద్ద రికార్డ్‌ నెలకొల్పారు. సుమారు 3430 గంటలు సీరియల్స్‌లో కనిపించారట. ‘‘టెలివిజన్‌ సీరియల్స్‌లో సుమారు 6850 ఎపిసోడ్స్‌లో నటించాను. అంటే 3430 గంటలు. ఇలాంటి ఫీట్‌ సాధించినందుకు నటిగా గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. రెండు నెలలు షార్ట్‌ బ్రేక్‌ తీసుకుందాం అనుకుంటున్నాను. మళ్లీ జూన్‌ నుంచి సరికొత్త అవతారంలో సన్‌టీవిలో రాత్రి 9.30 అలరిస్తూనే ఉంటాను. నాకు ఎల్లప్పూడు ప్రేమను పంచే అభిమానులందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు రాథిక.

Advertisement
 
Advertisement
Advertisement