టాలీవుడ్ నటి వైరల్ వీడియో! | raashi khanna will be share new video on International Women's day | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ నటి వైరల్ వీడియో!

Mar 4 2017 9:40 PM | Updated on Mar 3 2020 7:07 PM

టాలీవుడ్ నటి వైరల్ వీడియో! - Sakshi

టాలీవుడ్ నటి వైరల్ వీడియో!

టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా ఓ అరుదైన వీడియోతో మన ముందుకు రానుంది.

హైదరాబాద్‌: టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా ఓ అరుదైన వీడియోతో మన ముందుకు రానుంది. తనకు దక్కిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్న రాశీకన్నా ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. నిర్మాతగా కొత్త అవతారం ఎత్తిన ఈ ముద్దుగుమ్మ తన సొంత ప్రొడక్షన్‌లో స్పెషల్ ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 'బిలీవ్‌ ఇన్‌ యూ' అంటూ ఓ వీడియోను మన ముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది. తన ఫేస్‌బుక్‌ ఖాతాలో బిలీవ్ ఇన్ యూ అనే హ్యాష్ ట్యాగ్‌తో మేకింగ్‌ వీడియోను శనివారం తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ మేకింగ్ వీడియోను అందరికీ షేర్ చేయాలని రాశీఖన్నా కోరింది. మహిళా దినోత్సవం రోజు ఏదైనా ప్రత్యేకంగా చేయాలని భావించి ఆమె ఈ ప్రయత్నం చేయనుంది. ఎవరిని వారు పూర్తిగా నమ్ముకోవాలని దాంతో అద్భుతాలు చేయవచ్చునని చెప్పడమే విడుదల కాబోయే వీడియో సారాంశమని తెలుస్తోంది.

సొంతంగా రాసిన ఓ పద్యాన్ని కూడా పోస్ట్ చేసింది. నేనంటే ధైర్యం, నేనంటే అగ్ని, నేనంటే మీరు కోరుకున్నట్లుగా ఉండటం కాదు.. నాకు నచ్చినట్లుగా ఉండటం' అంటూ ఇంగ్లీష్ పద్యంలో రాసుకొచ్చింది మిల్కీ బ్యూటీ రాశీఖన్నా.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement