breaking news
believe in you
-
బిలీవ్ ఇన్ యూ అంటున్న రాశిఖన్నా
సామాజిక స్పృహ ఉన్న నటీమణులు చాలా తక్కువ మందే ఉంటారు. చేసేది వ్యాపారమే అయినా అందులోనూ ప్రజలకు అవసరమైనదో, వారికి స్ఫూర్తి నిచ్చే విషయాలు ఉండాలని భావించేవారు అరుదనే చెప్పాలి. వర్ధమాన నటి రాశిఖన్నా అలాంటి స్ఫూర్తిదాయకమైన ఒక వీడియోను ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ హైదరాబాదీ బ్యూటీ టాలీవుడ్లో కథానాయకిగా ఎదుగుతున్న నటి. అంతే కాదు కోలీవుడ్, మాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకునే స్టేజీలో ఉంది. అయితే ఆదిలోనే మెడ్రాస్ కేఫ్ అనే హిందీ చిత్రంలో నటించింది. మొత్తానికి బహుభాషా నటిగా అవతారమెతి్తన రాశిఖన్నా తమిళంలో సైతాన్ కా బచ్చా అనే చిత్రంతో పాటు నయనతార నటిస్తున్న ఇమైకా నోడిగళ్ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో కోలీవుడ్‌లో తన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. తెలుగులో కథానాయకిగా బిజీగా ఉన్న రాశిఖన్నా తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసే లక్కీఛాన్స్ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓకే నటిగా అమ్మడు చాలా హ్యాపీగానే ఉంది. ఇప్పుడు నిర్మాతగా, కవిగానూ మారడం విశేషం. నిర్మాతగా అనగానే తనేదో చిత్రం నిర్మిస్తోందని అనుకోకండి. ఒక వీడియో ఆల్బమ్‌ను రూపొందించింది.బిలీవ్ ఇన్ యూ పేరుతో రూపొందించిన ఈ ఆల్బమ్‌ను అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది. బిలీవ్ ఇన్ యూ( నిన్ను నీవు నమ్ము)ఈ పేరే అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉంది కదూ‘ ఇందులో ఒక కవితను కూడా రాశిఖన్నా రాసిందట. ఐయామ్ నాట్ ది సైజ్ ఆఫ్ మై జీన్స్ ..ఐయామ్ ది సైజ్ ఆఫ్ మై స్మైల్ వంటి అందరికీ, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిని కలిగించే కవితను రాశిఖన్నా ఈ ఆల్బమ్ కోసం రాసిందట.ఈ నెల 8వ తేదీన విడుదల కానున్న ఈ వీడియో ఆల్బమ్ పొందే స్పందన కోసం చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నట్లు నటి రాశిఖన్నా పేర్కొంది. -
టాలీవుడ్ నటి వైరల్ వీడియో!
హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా ఓ అరుదైన వీడియోతో మన ముందుకు రానుంది. తనకు దక్కిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్న రాశీకన్నా ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. నిర్మాతగా కొత్త అవతారం ఎత్తిన ఈ ముద్దుగుమ్మ తన సొంత ప్రొడక్షన్లో స్పెషల్ ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 'బిలీవ్ ఇన్ యూ' అంటూ ఓ వీడియోను మన ముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది. తన ఫేస్బుక్ ఖాతాలో బిలీవ్ ఇన్ యూ అనే హ్యాష్ ట్యాగ్‌తో మేకింగ్ వీడియోను శనివారం తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మేకింగ్ వీడియోను అందరికీ షేర్ చేయాలని రాశీఖన్నా కోరింది. మహిళా దినోత్సవం రోజు ఏదైనా ప్రత్యేకంగా చేయాలని భావించి ఆమె ఈ ప్రయత్నం చేయనుంది. ఎవరిని వారు పూర్తిగా నమ్ముకోవాలని దాంతో అద్భుతాలు చేయవచ్చునని చెప్పడమే విడుదల కాబోయే వీడియో సారాంశమని తెలుస్తోంది. సొంతంగా రాసిన ఓ పద్యాన్ని కూడా పోస్ట్ చేసింది. నేనంటే ధైర్యం, నేనంటే అగ్ని, నేనంటే మీరు కోరుకున్నట్లుగా ఉండటం కాదు.. నాకు నచ్చినట్లుగా ఉండటం' అంటూ ఇంగ్లీష్ పద్యంలో రాసుకొచ్చింది మిల్కీ బ్యూటీ రాశీఖన్నా. -
టాలీవుడ్ నటి వైరల్ వీడియో!