స్వర్గానికి దగ్గరగా... | Raai Laxmi tries sky diving | Sakshi
Sakshi News home page

స్వర్గానికి దగ్గరగా...

Jan 8 2015 11:35 PM | Updated on Sep 2 2017 7:24 PM

స్వర్గానికి  దగ్గరగా...

స్వర్గానికి దగ్గరగా...

కాంచన’ సినిమాలో కవ్వించిన రాయ్ లక్ష్మీ, రాఘవ లారెన్స్ తదుపరి చిత్రం ‘కరప్పు దురై’ కి సంబంధించి

‘కాంచన’ సినిమాలో కవ్వించిన రాయ్ లక్ష్మీ, రాఘవ లారెన్స్ తదుపరి చిత్రం ‘కరప్పు దురై’ కి సంబంధించి ముంబైలో కొన్ని నెలలుగా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రం సెట్స్‌కు వెళ్లేలోపు సరదాగా విహార యాత్రకు వెళ్లాలనుకున్నారామె. తన ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన రాయ్ లక్ష్మీ అక్కడ, కొన్ని సాహసాలు చేశారు. స్కై డైవ్ చేయాలనే తన కోరికను నెరవేర్చుకోవడంతో పాటు వాటర్ స్పోర్ట్స్‌తో సందడి చేశారు.  ఈ విషయం గురించి రాయ్ లక్ష్మీ చెబుతూ -‘‘13 వేల అడుగుల ఎత్తు నుంచి  స్కైడైవ్ చేయడానికి పూనుకున్నాను. దాంతో కొంచెం టెన్షన్‌గా అనిపించింది. గాల్లోకి ఎగిరేకొద్దీ స్వర్గానికి దగ్గరగా వెళుతున్నట్లనిపించింది. ఈ అనుభూతి   జీవితాంతం గుర్తుండిపోతుంది’’ అని అన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement