'సాలా ఖద్దూస్' ట్రైలర్ లాంచ్ | R madhavan starer saala khadoos trailer launch | Sakshi
Sakshi News home page

'సాలా ఖద్దూస్' ట్రైలర్ లాంచ్

Dec 16 2015 11:27 AM | Updated on Sep 3 2017 2:06 PM

'సాలా ఖద్దూస్' ట్రైలర్ లాంచ్

'సాలా ఖద్దూస్' ట్రైలర్ లాంచ్

బాలీవుడ్ స్క్రీన్ మీద తెరకెక్కుతున్న మరో రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా సాలా ఖద్దూస్. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న మాధవన్ బాక్సింగ్ కోచ్గా రఫ్ లుక్లో కనిపిస్తున్న ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్...

బాలీవుడ్ స్క్రీన్ మీద తెరకెక్కుతున్న మరో రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా సాలా ఖద్దూస్. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న మాధవన్ బాక్సింగ్ కోచ్గా రఫ్ లుక్లో కనిపిస్తున్న ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ నిర్మాణంలో తమిళ్, హిందీ భాషల్లో ఒకే సారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా కోసం మాధవన్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకోవటంతో పాటు బాక్సర్ లుక్లో కనిపించేందుకు భారీగా కండలు పెంచాడు. ఇప్పటికే ఇండియన్ స్క్రీన్ మీద రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామాలుగా తెరకెక్కిన మేరీ కోమ్, భాగ్ మిల్కా భాగ్, పాన్ సింగ్ తోమర్ సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

గతంలో ఎన్నడు కనిపించనంత న్యూ లుక్లో మాధవన్ కనిపిస్తున్న ఈ సినిమాలో రితికా సింగ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత మెజీషియన్ పీసీ సర్కార్ కూతురు ముంతాజ్ ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సాలా ఖద్దూస్ సినిమాను జనవరి చివరి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్రయూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement