మైనస్‌ పది డిగ్రీల చలిలో!

 R Madhavan Rocketry: The Nambi Effect movie updates - Sakshi

రష్యాలో షూటింగ్‌ కంప్లీట్‌ చేశారు మాధవన్‌. ఆయన దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్న చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. నంబి నారాయణన్‌ లుక్‌లోకి మారేందుకు మాధవన్‌ చాలా కష్టపడ్డ విషయం తెలిసిందే.

తాజాగా రష్యా షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేశారు మాధవన్‌. ‘‘రష్యా షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేశాం. మైనస్‌ పది డిగ్రీల వాతావరణంలో ఈ షూటింగ్‌ చేశాం. అనుకున్నదానికన్నా ఐదు రోజులు ముందే ఈ షెడ్యూల్‌ పూర్తి చేశాం. దీనికి మా టీమ్‌ అందరి కృషి ఉంది’’ అని పేర్కొన్నారు మాధవన్‌. తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top