హమ్మయ్య.. సౌత్ 'క్వీన్' పట్టాలెక్కింది..!

Queen Tamil remake with Kajal launched

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ముందుగా ఈ సినిమా తమన్నా లీడ్ రోల్ లో తెరకెక్కుతుందన్న టాక్ వినిపించింది. అయితే తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో క్వీన్ తమిళ రీమేక్ ను పక్కన పెట్టేశారు. అయితే ఇప్పటికే పరుల్ యాదవ్ లీడ్ రోల్ లో కన్నడలో ఈ సినిమా రీమేక్ పనులు జరుగుతుండగా తాజాగా తమిళ క్వీన్ కూడా పట్టాలెక్కేసింది.

తమన్నా తరువాత తెరమీదకు వచ్చిన కాజల్ క్వీన్ గా నటించేందుకు అంగీకరించింది. నటుడు, దర్శకుడు రమేష్ అరవింద్ ఈ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. 'పారిస్ పారిస్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా లాంచింగ్ సందర్భంగా ఈ సందర్భంగా తాను ఎవరినీ అనుకరించనని.. తన స్టైల్ లోనూ క్వీన్ పాత్రలో నటిస్తానని తెలిపింది కాజల్. అంతేకాదు ఒరిజినల్ వర్షన్ నుంచి కేవలం కథను మాత్రమే తీసుకొని కొత్త తరహా టేకింగ్ తో సినిమాను రూపొందిస్తున్నారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆదివారం ఉదయం ప్రారంభించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top