సైలెంట్‌గా కానిచ్చేశారు! | Puri Jagannath's Rogue with new hero ISHAN | Sakshi
Sakshi News home page

సైలెంట్‌గా కానిచ్చేశారు!

Feb 18 2017 11:56 PM | Updated on Mar 22 2019 1:53 PM

షూటింగ్‌ లొకేషన్‌లో పూరి జగన్నాద్‌ - Sakshi

షూటింగ్‌ లొకేషన్‌లో పూరి జగన్నాద్‌

ఫొటో చూశారా.. అంత పెద్ద డైరెక్టర్‌ అయ్యుండి కింద కూర్చుని, అమ్మాయి కాళ్ల వైపు ఎలా చూస్తున్నాడో చూడండి.

ఫొటో చూశారా.. అంత పెద్ద డైరెక్టర్‌ అయ్యుండి కింద కూర్చుని, అమ్మాయి కాళ్ల వైపు ఎలా చూస్తున్నాడో చూడండి. ఏంటిది రోగ్‌లా అనుకుంటున్నారా? మరి సార్‌ తీస్తున్నది ‘రోగ్‌’ సినిమా కదా. అందుకే ఇలా నాటీగా బిహేవ్‌ చేస్తున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. అప్పుడు ‘ఇడియట్‌’ అన్నా, నిన్న ‘లోఫర్‌’ అన్నా, ఈరోజు ‘రోగ్‌’ అన్నా పూరీకే చెల్లుబాటయింది. నెగటివ్‌ టైటిల్‌ పెట్టినప్పటికీ జనాలను పాజిటివ్‌గా థియేటర్‌కి రప్పించేస్తారు పూరి. ఇక, ఈ ‘రోగ్‌’ గురించి చెప్పాలంటే.. సైలెంట్‌గా సిన్మా కానిచ్చేశారు.

అన్నట్లు.. మన పూరి చూపించిన చంటిగాడు గుర్తున్నాడా? అదేనండీ ‘ఇడియట్‌’లో రవితేజ. ఇప్పుడు చంటి గురించి ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? మరేం లేదు.. ఈ ‘రోగ్‌’ టైటిల్‌కి ‘మరో చంటిగాడి ప్రేమకథ’ అని ట్యాగ్‌లైన్‌ పెట్టారు. కొత్త అబ్బాయి ఇషాన్‌ని హీరోగా పరిచయం చేస్తూ, పూరి తీసిన ఈ సినిమాలో మన్నార్‌ చోప్రా, ఏంజెల్‌ హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే తెలుగు, కన్నడ భాషల్లో సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. సీఆర్‌ మనోహర్, సీఆర్‌ గోపి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement