వాస్తవ సంఘటనల అశ్వథ్థామ

Puri Jagannath Launches Naga ShauryaAshwathama Trailer - Sakshi

నాగసౌర్య, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి  నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ రేపు (గురువారం) సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నారు.

‘‘సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలతో నాగశౌర్య ఈ సినిమా కథని రాసుకున్నారు. హీరోయిన్‌ సమంత ఇటీవల విడుదల చేసిన మా సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్‌ కూడా అందరి అంచనాలకు తగ్గట్టు ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్‌ రెడ్డి, సంగీతం: శ్రీచరణ్‌  పాకాల, లైన్‌ ప్రొడ్యూసర్‌: బుజ్జి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top