జాక్స్‌ని చాలా బాధ పెట్టా : పూరి జగన్నాథ్‌

Puri Jagannath Heart melting tweet about his dog Jacks - Sakshi

తనకెంతో ఇష్టమైన శునకం జాక్స్‌ మృతిచెందడం, ప్రముఖ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ని కలచివేసింది. సినిమా కష్టాల వల్ల జాక్స్‌ని కొన్ని ఏళ్లపాటూ వదిలేయాల్సి రావడంతో వాడు హర్ట్‌ అయ్యాడని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 'వీడి పేరు జాక్స్‌. ఎప్పుడూ నాతోనే ఉండేది. ఒకానొక సమయంలో వీడిని పెంచే పరిస్థితి లేక నా స్నేహితుడికి ఇచ్చేశాను. ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ తీసుకొచ్చేశాను. కానీ వాడు హర్ట్‌ అయ్యి అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేశాడు.

నా దగ్గరకు రాడు, నావైపు చూడడు, తోక కూడా ఊపి ఇప్పటికి 8 సంవత్సరాలు అయ్యింది. నేను లైఫ్‌లో ఎంత  మందిని బాధపెట్టానో నాకు తెలియదు. కానీ, వీడిని మాత్రం చాలా బాధపెట్టాను. వాడు ఇంకా లేడు, ఇదే వాడికి చివరి రోజు' అంటూ ట్వీట్‌ చేశారు. మీ కామెంట్‌ చదివితేనే గుండె బరువెక్కుతోంది. అలాంటిది మీరెంత బాధపడుతున్నారో అర్థం చేసుకోగలం.. జాక్స్‌ ఆత్మకు శాంతి చేకూరాలి కోరుకుంటున్నామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top