పక్కా మాస్! | Puri Jagannath and varun tej Movie title As loafer | Sakshi
Sakshi News home page

పక్కా మాస్!

Jun 22 2015 12:24 AM | Updated on Sep 3 2017 4:08 AM

పక్కా మాస్!

పక్కా మాస్!

‘ముకుంద’ అంటూ సాఫ్ట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు ‘లోఫర్’ అంటూ పక్కా మాస్ టైటిల్‌తో రానున్నారు.

‘ముకుంద’ అంటూ సాఫ్ట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు ‘లోఫర్’ అంటూ పక్కా మాస్ టైటిల్‌తో రానున్నారు. టైటిల్ పూరి జగన్నాథ్ స్టయిల్‌లో ఉందనిపిస్తోందా? సరిగ్గానే ఊహించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించనున్న చిత్రానికే ఈ టైటిల్‌ని ఖరారు చేశారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘వచ్చే నెల 10న జోధ్‌పూర్‌లో షూటింగ్ ప్రారంభిస్తాం. విజయదశమికి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: పీజీ వింద, ఆర్ట్: విఠల్ కోసనం, సంగీతం: సునీల్ కశ్యప్, సమర్పణ: శ్వేతలానా, వరుణ్, తేజ, సీవీ రావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement